WE PROVIDE THE BEST VALUE INSURANCE Simple Steps You Can Take to Improve Your Financial Well – Being for the rest Your Life
భీమా తో ధీమా
అన్లిమిటెడ్’ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ – ఎన్ని సార్లైనా, ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు! –
30 ఏళ్లలోపే ఆరోగ్య బీమా తీసుకోండి.. ఎందుకంటే..?
పెరుగుతున్న కాలుష్య స్థాయిలకు తోడు ఆదుర్దా, ఆందోళన కారణంగా యువత సైతం జీవన శైలి రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. గుండె జబ్బులతో పాటు ఇతరత్రా రోగాలు వచ్చేస్తున్నాయి. ఇవి యువ జనాభాపై చాలా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి. భవిష్యత్ వైద్య చికిత్సలు, అత్యవసరాలకు ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది.
ఇది దండగ ఖర్చు కాదు!
ఆరోగ్య బీమా తీసుకుని ఆసుపత్రిలో చేరకపోతే, ప్రీమియం దండగ అవుతుందని చాలా మంది అనుకుంటుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే, నేటి కాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకసారి హెల్త్ ప్రోబ్లమ్ వచ్చిందంటే, జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా ఖర్చు అయిపోతోంది. అందుకే ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ ఉండడం తప్పనిసరి.